ఉచ్చారణ స్థానాలు
Uccharana sthanalu (places of articulation)
ఉచ్చారణ స్థానం అంటే ఒక వర్ణాన్ని పలికేటప్పుడు నాలుక లేదా పెదవులు ముఖ్యంగా పనిచేసే చోటు: కంఠం, తాలువు, మూర్ధం, దంతాలు, ఓష్ఠాలు. వర్ణాలను ఈ చోట్లను బట్టి కంఠ్యాలు, తాలవ్యాలు వంటి వర్గాలుగా విభజిస్తారు.
The uccharana sthanam is the place in the mouth where a sound is mainly produced: throat, palate, the roof of the mouth (retroflex), teeth, lips. Sounds are grouped by these places as kanthyas, talavyas and so on.
నిర్వచనం Definition
ప్రతి వర్ణాన్ని పలికేటప్పుడు గాలి లేదా నాలుక ముఖ్యంగా తగిలే చోటును ఉచ్చారణ స్థానం అంటారు. సంప్రదాయ వ్యాకరణం వర్ణాలను ఐదు ముఖ్య స్థానాల ప్రకారం వర్గీకరిస్తుంది.
The place where air or the tongue chiefly touches while a sound is spoken is called its uccharana sthanam. Traditional grammar classifies sounds under five main places.
గుర్తించడం, ఉదాహరణలు Recognising it, examples
కంఠ్యాలు (కంఠం): అ, ఆ, క-వర్గం (క, ఖ, గ, ఘ, ఙ).
తాలవ్యాలు (తాలువు): ఇ, ఈ, చ-వర్గం (చ, ఛ, జ, ఝ, ఞ).
మూర్ధన్యాలు (మూర్ధం, అంటే నోటి పైభాగం): ఋ, ౠ, ట-వర్గం (ట, ఠ, డ, ఢ, ణ).
దంత్యాలు (దంతాలు): త-వర్గం (త, థ, ద, ధ, న).
ఓష్ఠ్యాలు (పెదవులు): ఉ, ఊ, ప-వర్గం (ప, ఫ, బ, భ, మ).
Kanthyas (throat): a, aa, the ka-group (ka, kha, ga, gha, nga).
Talavyas (palate): i, ii, the cha-group (cha, chha, ja, jha, nya).
Murdhanyas (the roof of the mouth, retroflex): ru, ruu, the ta-group (ta, tha, da, dha, na).
Dantyas (teeth): the ta-group (ta, tha, da, dha, na).
Oshthyas (lips): u, uu, the pa-group (pa, pha, ba, bha, ma).
గమనికలు Notes
ఎ, ఏ, ఐ లను కంఠతాలవ్యాలుగా, ఒ, ఓ, ఔ లను కంఠోష్ఠ్యాలుగా సంప్రదాయ గ్రంథాలు చెబుతాయి (సరిచూడాలి). య, ర, ల, వ, శ, ష, స, హ వంటి ఇతర హల్లుల స్థానాల వివరాలు గ్రంథాన్ని బట్టి మారతాయి కాబట్టి ఇక్కడ ఇవ్వలేదు.
ఈ పేజీ పాఠ్యపుస్తక స్థాయి సారాంశం మాత్రమే. ధ్వనిశాస్త్రం (ఫొనెటిక్స్) ఆధునికంగా ఇంతకంటే సూక్ష్మంగా వర్ణాలను వివరిస్తుంది.
Traditional books place e, ee and ai under the throat and palate together, and o, oo and au under the throat and lips together (subject to verification). The places of other consonants such as ya, ra, la, va, sha, sa, ha differ by book, so they are not given here.
This page is only a textbook-level summary. Modern phonetics describes sounds in more detail.