వర్తమాన కాలం
Vartamanakalam (present tense)
వర్తమాన కాలం అంటే మాట్లాడే సమయంలో జరుగుతున్న పనిని తెలిపే క్రియా కాలం. తెలుగులో ఇది సాధారణంగా తింటున్నాడు, చదువుతున్నాడు వంటి రూపాల్లో కనిపిస్తుంది.
Vartamanakalam is the present tense: the tense of a verb that tells of an action going on at the time of speaking. In Telugu it is usually seen in forms such as tintunnadu and chaduvutunnadu.
నిర్వచనం Definition
వర్తమాన కాలం అంటే ఇప్పుడు జరుగుతున్న పనిని చెప్పే కాలం. సంప్రదాయ వ్యాకరణంలో భూత, భవిష్యత్ కాలాలతో పాటు ఇది మూడు కాలాల్లో ఒకటి.
Vartamanakalam is the tense that tells of an action going on now. In traditional grammar it is one of the three tenses, along with the past and the future.
గుర్తించడం, ఉదాహరణలు Recognising it, examples
క్రియ చివర 'తున్నాడు', 'టున్నాడు', 'తున్నది' వంటి భాగం కనిపిస్తుంది.
అతడు అన్నం తింటున్నాడు.
ఆమె ఉత్తరం రాస్తున్నది.
నేను పుస్తకం చదువుతున్నాను.
సాహిత్య భాషలో ఇదే భావాన్ని 'చున్నాడు' వంటి రూపాలతో చెబుతారు (చదువుచున్నాడు).
The verb ends in a part such as "tunnadu" or "tunnadi".
atadu annam tintunnadu. (He is eating rice.)
ame uttaram rastunnadi. (She is writing a letter.)
nenu pustakam chaduvutunnanu. (I am reading a book.)
Literary language gives the same sense with forms such as "chunnadu" (chaduvuchunnadu).
గమనికలు Notes
ఇక్కడ ఇచ్చింది పాఠ్యపుస్తక స్థాయి వివరణ. 'చదువుతాడు', 'తింటాడు' వంటి రూపాలు అలవాటును లేదా రాబోయే పనిని కూడా చెబుతాయి; వాటిని వర్తమానం అనాలా భవిష్యత్తు అనాలా అనే విషయంలో పుస్తకాలు ఒకే విధంగా చెప్పవు. తెలుగులో మూడు కాలాలు (వర్తమాన, భూత, భవిష్యత్) అనేది సంప్రదాయ పద్ధతి; ఆధునిక భాషా శాస్త్రవేత్తలు భూత, అభూత అని రెండుగా చెబుతారు (సరిచూడాలి).
This is a textbook-level account. Forms such as "chaduvutadu" and "tintadu" also express a habit or a coming action, and books do not agree on whether to call them present or future. Three tenses (present, past, future) is the traditional method; modern linguists describe two, past and non-past (subject to verification).